ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలి: మహబూబ్ నగర్ కలెక్టర్ ఖుష్బూ గుప్తా

ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలి: మహబూబ్ నగర్ కలెక్టర్ ఖుష్బూ గుప్తా

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: మహబూబ్‌‌‌‌నగర్ జిల్లాలో ఆయిల్ పామ్ ప్రాముఖ్యతను రైతులకు వివరించి సాగు చేసేలా ప్రోత్సహించాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా సూచించారు. బుధవారం భూత్పూర్ మండలం తాటికొండ గ్రామ రైతు వేదికలో నిర్వహించిన 100వ ‘ఆయిల్ పామ్ ముచ్చట్లు’ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.

సాగు చేసే రైతులకు జిల్లా యంత్రాంగం నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. డబుల్ ల్యాటరల్ డ్రిప్, మోటారైజ్డ్ చిజెల్, కస్టమ్ హైరింగ్ సెంటర్లు, తోటలపై విద్యుత్ తీగల తొలగింపు, సోలార్ ఫెన్సింగ్ వంటి రైతుల విజ్ఞప్తులను పరిశీలించి నెరవేరుస్తామని చెప్పారు.

జిల్లాలో మొత్తం 5,000 ఎకరాల ఆయిల్ పామ్ సాగు సామర్థ్యం ఉండగా, ఇప్పటివరకు 4,800 ఎకరాల్లో తోటల పెంపకం పూర్తయిందని ఉద్యాన శాఖ అధికారులు కలెక్టర్‌‌‌‌కు వివరించారు.