రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా పరిచయం అవుతున్న విలేజ్ యాక్షన్ డ్రామా ‘మారెమ్మ’. మంచాల నాగరాజు దర్శకత్వంలో మయూర్ రెడ్డి బండారు నిర్మిస్తున్నారు. దీపా బాలు హీరోయిన్‌గా నటిస్తోంది. బుధవారం మేకర్స్ ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు.
సెప్టెంబర్ 10న థియేటర్లలో విడుదల కానుందని ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో మాధవ్ ఇంటెన్స్ లుక్‌లో కనిపించాడు. హీరోకు, బర్రెకు మధ్య కనిపించే పేస్ అఫ్ ఈ మూవీ కాన్సెప్ట్‌ను ప్రజెంట్ చేస్తోంది.
రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో స్థానిక సంస్కృతి, సంప్రదాయాలు, బలమైన భావోద్వేగాలు కలగలిసిన యాక్షన్ డ్రామాగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. వినోద్ కుమార్, వికాస్ వశిష్ట, దయానంద్ రెడ్డి, వీఎస్ రూపాలక్ష్మి ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం అందిస్తున్నాడు.
మారెమ్మ తల్లి దీవెనలతో...🙏
— Moksha arts (@MokshaArtsoffl) July 22, 2026
The fearless tale of blood, belief & sacrifice is ready to take you on an emotional ride 🐃🔥#MAREMMA GRAND RELEASE WORLDWIDE ON SEPTEMBER 10th, 2026 ❤️🔥❤️🔥❤️🔥#MaremmaOnSept10th@maadhav_9999 @Deepabalu_ @MKNagaraju #MayurReddyBandaru @prasanth_ank7… pic.twitter.com/9lsK9GWjBh
