ఆ బయోపిక్‌‌‌‌ నుంచి బయటకు..ఆమిర్ ఖాన్..

ఆ బయోపిక్‌‌‌‌ నుంచి బయటకు..ఆమిర్ ఖాన్..

బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ హీరోగా భారతీయ స్టార్టప్ రంగంలో సంచలనం సృష్టించిన భారత్‌‌‌‌ పే వ్యవస్థాపకుడు, ‘షార్క్ ట్యాంక్ ఇండియా’ మాజీ జడ్జి అష్నీర్ గ్రోవర్ బయోపిక్‌‌‌‌ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడీ ప్రాజెక్ట్‌‌‌‌ నుంచి ఆమిర్ ఖాన్‌‌‌‌ తప్పుకున్నట్టు తెలుస్తోంది. 

స్టార్టప్‌‌‌‌ల ప్రపంచంపై ఉన్న ఆసక్తితో ఈ సినిమాకు ఓకే చెప్పిన ఆమిర్.. స్క్రిప్ట్‌‌‌‌ వర్క్‌‌‌‌లో కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలో దర్శకుడు రాహుల్‌‌‌‌ మోడీతో ఏర్పడిన క్రియేటివ్ డిఫరెన్సెస్‌‌‌‌ కారణంగా ఆయన ఈ చిత్రం నుంచి బయటకు వచ్చేశారట.  దీనిపై అధికారిక ప్రకటన రావల్సి ఉంది. 

ఆమిర్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌ ఈ ప్రాజెక్ట్‌‌‌‌ నుంచి తప్పుకోవడంతో మేకర్స్‌‌‌‌ ఆ స్థానంలో మరో హీరోను ఎంపిక చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే కొందరు హీరోలతో చర్చలు జరిపినట్టు టాక్. అష్నీర్ గ్రోవర్ భార్య మాధురి జైన్‌‌‌‌ పాత్రను ఇందులో శ్రద్ధా కపూర్‌‌‌‌‌‌‌‌ పోషించనుంది.