కొలంబో: శ్రీలంక అండర్–19 జట్టుతో జరుగుతున్న రెండో అనధికార టెస్ట్ మ్యాచ్‌లో ఇండియా అండర్–19 జట్టు గెలుపు దిశగా సాగుతోంది. ఓపెనర్ లక్ష్య రాయ్‌చందానీ (100 నాటౌట్) సెంచరీతో చెలరేగడంతో టీమిండియా.. శ్రీలంక ముందు 472 రన్స్ లక్ష్యాన్ని నిర్దేశించింది. దీన్ని ఛేదించేందుకు బుధవారం మూడో రోజు బరిలోకి దిగిన లంక ఆట ముగిసే టైమ్‌కు రెండో ఇన్నింగ్స్‌లో 36 ఓవర్లలో 155/4 స్కోరు చేసింది.
విమత్ దిన్సారా (55 బ్యాటింగ్), కవిజా గమాగే (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. సెనుజా (64), విరాన్ (31) ఫర్వాలేదనిపించారు. అంతకుముందు 122/8 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన లంక తొలి ఇన్నింగ్స్‌లో 52.1 ఓవర్లలో 148 రన్స్‌కు ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇండియా రెండో ఇన్నింగ్స్‌ను 40.2 ఓవర్లలో 208/3 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది.
