Sourav Ganguly: ఇండియన్ టెలివిజన్ చరిత్రలోనే అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షోగా బిగ్ బాస్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, హిందీ, తమిళం సహా అన్ని భాషల్లోనూ ఈ షోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు అన్ని భాషల్లోనూ కేవలం సినీ సెలబ్రిటీలే వ్యాఖ్యాతలుగా (హోస్ట్‌లుగా) వ్యవహరించారు. కానీ, బిగ్ బాస్ చరిత్రలోనే సరికొత్త అధ్యాయానికి తెరలేప్తూ.. ఒక మాజీ స్టార్ క్రికెటర్ హోస్ట్ అవతారమెత్తబోతున్నారు. ఆయనే టీమిండియా మాజీ కెప్టెన్, దాదా సౌరభ్ గంగూలీ.
ఒకేసారి 6 భాషల్లో బిగ్ బాస్ హంగామా:
సాధారణంగా వివిధ భాషల్లో బిగ్ బాస్ షోలు వేర్వేరు సమయాల్లో ప్రారంభమవుతుంటాయి. కానీ ఈసారి సరికొత్త రికార్డు సృష్టిస్తూ రాబోయే సెప్టెంబర్ నెలలో ఏకంగా ఆరు భాషల్లో ఒకేసారి బిగ్ బాస్ కొత్త సీజన్లు స్టార్ట్ కానున్నాయి. దీనికి సంబంధించి జియోహాట్‌స్టార్ (JioHotstar) ఒక ప్రత్యేక వీడియో ద్వారా అధికారిక ప్రకటన విడుదల చేసింది. బిగ్ బాస్ బెంగాలీ సీజన్ 3కి సౌరభ్ గంగూలీ హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు.
ఆయా భాషల హోస్ట్‌ల జాబితా ఇదే:
* హిందీ: సల్మాన్ ఖాన్
* తెలుగు: అక్కినేని నాగార్జున
* తమిళం: విజయ్ సేతుపతి
* కన్నడ: కిచ్చా సుదీప్
* మలయాళం: మోహన్‌లాల్
* పశ్చిమ బెంగాలీ: సౌరభ్ గంగూలీ
10 ఏళ్ల తర్వాత గంగూలీ కంబ్యాక్:
దాదాపు 10 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బిగ్ బాస్ బెంగాలీ సీజన్ 3 రూపంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ షోను అత్యంత ప్రతిష్టాత్మకంగా రీ-లాంచ్ చేసేందుకు నిర్వాహకులు సౌరభ్ గంగూలీని రంగంలోకి దించారు. ఈ ఒక్క సీజన్ హోస్ట్ చేయడం కోసం గంగూలీకి ఏకంగా రూ. 125 కోట్ల భారీ పారితోషికం ఇస్తున్నట్లు తెలుస్తుంది. బుల్లితెర చరిత్రలోనే ఇది ఒక రికార్డు స్థాయిలో నిలిచే ఆఫర్ కానుంది.
►ALSO READ | భారత్ vs జింబాబ్వే టీ20 రికార్డ్స్.. అత్యధిక పరుగులు, వికెట్లు, సిక్సర్లు ఎవరివంటే?
టీవీ స్క్రీన్‌పై మళ్లీ దాదాగిరి:
గంగూలీకి బుల్లితెరపై హోస్టింగ్ చేయడం కొత్తేమీ కాదు. గతంలో జీ బెంగాలీ ఛానెల్‌లో వచ్చిన దాదాగిరి అన్లిమిటెడ్ క్విజ్ షోతో వ్యాఖ్యాతగా ఆయన సరికొత్త రికార్డు సృష్టించారు. తనకంటూ ప్రత్యేకమైన టైమింగ్, స్వాగ్‌తో బెంగాలీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. మైండ్ మైండ్ టీవీ గేమ్‌ని క్రికెట్ మైదానంతో పోల్చితే.. దాదా ఇచ్చే పంచ్‌లు, షో నడిపించే శైలి వేరే లెవల్‌లో ఉంటుంది. క్రికెట్ గ్రౌండ్‌లో కెప్టెన్‌గా భారత్‌కు అద్భుత విజయాలందించిన సౌరభ్, ఇప్పుడు బిగ్ బాస్ హోస్ట్‌గా బుల్లితెరపై ఎలాంటి దాదాగిరి చూపిస్తారో అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు.
2 decades later… still the most eye-conic one 👁️#BiggBoss20, jald aa raha hai!#BiggBossOnJioHotstar #BB20OnJioHotstar pic.twitter.com/hqIyooGpoy
— JioHotstar Reality (@HotstarReality) July 21, 2026
