విభిన్నమైన కథలు, వైవిధ్యభరిత చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును అందుకున్నారు కళ్యాణ్ రామ్. ప్రస్తుతం ఆయన వెంకటేష్‌తో కలిసి ఓ మల్టిస్టారర్‌లో నటిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ మూవీ సెట్స్‌పై ఉండగానే ఆయన మరో సినిమాకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.
‘గీత గోవిందం’ లాంటి చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు పరశురామ్.. ఇటీవల కళ్యాణ్ రామ్‌ను కలిసి ఓ స్టోరీ లైన్ వినిపించినట్టు సమాచారం. ఆయన నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. దిల్ రాజు ఈ సినిమాను నిర్మించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.
పరశురామ్ మార్క్ వినోదం, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు మాస్, కమర్షియల్ అంశాలు ఉండేలా ఈ స్క్రిప్ట్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. పరశురామ్ గత చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోవడంతో తన కెరీర్‌కు ఈ ప్రాజెక్ట్ కీలకంగా మారింది. అన్నీ కుదిరితే త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన వెలువడనుంది.
