నా చావుకు పీఎం మోడీ కారణం.. SIR ఫామ్ మీద రాసి ఉరేసుకున్న యువకుడు..

నా చావుకు పీఎం మోడీ కారణం.. SIR ఫామ్ మీద రాసి ఉరేసుకున్న యువకుడు..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో తన చావుకు ప్రధాని మోడీ కారణమంటూ ఓ యువకుడు సర్ ఫామ్ మీద రాసి ఉరేసుకోవడం కలకలం రేపింది. గురువారం ( జులై 23 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచగోర్లపల్లికి చెందిన శివ పిట్లా వంశి అనే 25 ఏళ్ళ యువకుడు ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చావుకు ప్రధాని మోడీ కారణమంటూ సర్ ఫామ్ మీద సూసైడ్ నోట్ రాయడం కలకలం రేపింది.

నా చావుకు పీఎం మోదీ కారణం.. కుటుంబానికి సంబంధం లేదంటూ...తన దహనసంస్కారాలు ఆనవాయితీ ప్రకారం జరిపించాలని లేఖలో పేర్కొన్నాడు వంశీ. ఈ ఘటనపై తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

సూసైడ్ నోట్ సహా అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీసులు. నీట్ పేపర్ లీక్ పై కేంద్రానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న క్రమంలో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.