బ్రిడ్జ్‌టౌన్: ఛేజింగ్‌లో హెట్‌మయర్ (69 నాటౌట్), షెర్ఫానే రూథర్‌ఫోర్డ్ (61) రాణించడంతో.. న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన ఆఖరిదైన ఐదో వన్డేలో వెస్టిండీస్ 2 వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ ఓడిన కివీస్ 50 ఓవర్లలో 268/9 స్కోరు చేసింది. టామ్ లాథమ్ (69), నిక్ కెల్లీ (64), విల్ యంగ్ (56) హాఫ్ సెంచరీలు సాధించారు.
విటల్ లూయిస్, అల్జారీ జోసెఫ్ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత విండీస్ 47.3 ఓవర్లలో 269/8 స్కోరు చేసి నెగ్గింది. అకీమ్ అగస్టి (34), షై హోప్ (39), జస్టిన్ గ్రీవ్స్ (22), కేసీ కార్టీ (20) ఫర్వాలేదనిపించారు.
డఫీ, లెనాక్స్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. హెట్‌మయర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, లెనాక్స్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.
