హరారే: జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు టీమిండియా రెడీ అయ్యింది. ఈ నేపథ్యంలో గురువారం ఇరుజట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఐర్లాండ్, ఇంగ్లండ్ చేతిలో సిరీస్‌లు కోల్పోయిన యంగ్‌స్టర్స్‌కు జింబాబ్వేపై సిరీస్ గెలవడం అత్యంత ప్రాధాన్యం. టీమిండియా కెప్టెన్‌గా తన తొలి విజయం కోసం శ్రేయస్ అయ్యర్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాడు. తన సారథ్యంలో ఆడిన తొలి ఏడు మ్యాచ్‌ల్లో ఆరింటిలో ఓడాడు.. దాంతో శ్రేయస్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. అదే టైమ్‌లో 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీపై కూడా అందరి దృష్టి నెలకొంది.
అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించనున్న వైభవ్ సంచలన ఇన్నింగ్స్ ఆడతాడని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. హరారే గ్రౌండ్‌లో ఈ ఇద్దరికీ మంచి రికార్డు ఉండటం కలిసొచ్చే అంశం. ఈ గ్రౌండ్‌లో అరంగేట్రం చేసిన రెండో మ్యాచ్‌లోనే అభిషేక్ సెంచరీ చేశాడు. జూనియర్ వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లండ్ అండర్–19 జట్టుపై వైభవ్ కూడా శతకం సాధించాడు. వీళ్లిద్దర్ని పక్కనబెడితే మూడో ప్లేస్ కోసం తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ మధ్య గట్టి పోటీ నెలకొంది. అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఇషాన్‌ను మూడో ప్లేస్‌లో ఆడించే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో తిలక్ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు రానున్నాడు.
అయితే టీ20ల్లో తిలక్‌కు మూడో ప్లేస్‌లో మంచి రికార్డు ఉంది. ఐదో ప్లేస్‌లో హిట్టర్‌గా రింకూ సింగ్ బాగా పనికొస్తాడు. కాబట్టి దీనిపై మేనేజ్‌మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. బౌలింగ్‌లో మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్‌తో పాటు మూడో పేసర్‌గా అశోక్ శర్మ, యష్ ఠాకూర్‌లో ఒకరికి చాన్స్ దక్కొచ్చు. ఆల్‌రౌండర్లుగా హర్ష్ దూబే, శివమ్ దూబే, సూర్యాన్ష్ షెడ్జ్ మధ్య పోటీ నెలకొంది.
బౌలర్ల నుంచి ముప్పు..
ఈ సిరీస్‌పై జింబాబ్వే కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. బ్యాటింగ్‌లో బ్రియాన్ బెన్నెట్, సికిందర్ రజా, బ్రాడ్ ఇవాన్స్, రైన్ బర్ల్‌పై ఎక్కువగా ఆధారపడుతున్నారు. బౌలింగ్‌లో బ్లెస్సింగ్ ముజరబాని, రిచర్డ్ ఎంగ్రావా నుంచి ముప్పు తప్పదు. ఈ ఇద్దరు పొడవైన, శక్తివంతమైన ఫాస్ట్ బౌలర్లు కావడంతో టీమిండియా బ్యాటర్లకు కఠిన సవాలు ఎదురుకానుంది. 2024లో ఆడిన నాలుగు, ఇటీవల ఫిబ్రవరిలో జరిగిన ఒక మ్యాచ్‌లో ఇండియానే విజయం సాధించింది. కాబట్టి ఈ సిరీస్‌లోనూ టీమిండియా విజయాన్ని సులువుగా ఆశిస్తున్నా.. పోటీ అయితే తప్పకపోవచ్చు.
తుది జట్లు (అంచనా)
ఇండియా: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, హర్ష్ దూబే, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, యష్ ఠాకూర్ / అశోక్ శర్మ.
జింబాబ్వే: సికిందర్ రజా (కెప్టెన్), బ్రియాన్ బెన్నెట్, మురుమణి, డియాన్ మేయర్స్ / వెస్లీ మదెవరా, రైన్ బర్ల్, బ్రాడ్ ఇవాన్స్, మసకద్జా, మిల్టన్ శుంభా, నైమురి, రిచర్డ్ ఎంగ్రావా, బ్లెస్సింగ్ ముజురబాని.
పిచ్, వాతావరణం
పిచ్‌పై తేమ ఎక్కువగా ఉంటుంది. బంతి బౌన్స్ అయ్యే చాన్సెస్ ఎక్కువ. పేసర్లకు అనుకూలం. బ్యాటర్లకు ఫుట్‌వర్క్ చాలా ప్రధానం. వర్షం ముప్పు లేదు.
