నిర్మల్, వెలుగు: ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల డ్రాపౌట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లో విద్యాశాఖపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో బోధన, సౌకర్యాలు, తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు.
ప్రతి రోజూ తప్పనిసరిగా టీచర్లు, విద్యార్థులు ఎఫ్ఆర్ఎస్ హాజరు నమోదు చేయాలని చెప్పారు. టీచర్ల హాజరు ప్రతిరోజూ 90 శాతానికి తగ్గకుండా ఉండాలన్నారు. నూతన విద్యార్థుల ఎఫ్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేయాలని ఆదేశించారు. తల్లిదండ్రులతో మాట్లాడి విద్యార్థులు ప్రతిరోజూ స్కూల్‌కు వచ్చేలా చొరవ చూపాలన్నారు. టెన్త్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. సమావేశంలో డీఈవో భోజన్న, విద్యాశాఖ అధికారులు, కాంప్లెక్స్ హెచ్ఎంలు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
