ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టాలి : నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా

ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టాలి :  నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా

​​​​కుంటాల, వెలుగు: ఎల్​నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు ప్రతి నీటి బొట్టును సంరక్షించాలని నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా ప్రజలకు సూచించారు. కుంటాల మండలంలోని గిరిజన గ్రామం అంబుగాంలో మంగళవారం ఆయన పర్యటించారు. జలసిరి పథకంలో భాగంగా ఇంటింటికి ఇంకుడుగుంత, పంట చేనులో సేద్యపు గుంటలు నిర్మించుకునేలా విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. 

నీటి సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై భూగర్భ జలాలను పెంచాలని గ్రామస్తులకు సూచించారు. గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని వారు కోరగా బోర్ వేయించి సమస్య తీరుస్తానన్నారు. అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్ రావు, డీఆర్ డీవో విజయ లక్ష్మి, తహసీల్దార్ కమల్ సింగ్, సర్పంచ్ శివాజీ, అధికారులు పాల్గొన్నారు.