తొగుట (దుబ్బాక), వెలుగు : దుబ్బాకలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయాలని దుబ్బాక డెవలప్మెంట్ ఫోరమ్ అఖిలపక్ష నాయకులు మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డిని మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు.
తెలంగాణ ప్రభుత్వం రూ.200 కోట్లతో నిర్మించనున్న స్కిల్ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ ను దుబ్బాక పట్టణంలోనే ఏర్పాటు చేయాలని కోరారు. దీనిి మంత్రి సానుకూలంగా స్పందించారు. మున్సిపల్ చైర్పర్సన్ శ్రీరామ్ సంగీత రవీందర్, వైస్ చైర్పర్సన్ ఆస సులోచన స్వామి పాల్గొన్నారు.
