డల్లాస్ నుంచి నెవార్క్ వెళ్తున్న అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఓ ప్రయాణికుడు విపరీతంగా హంగామా చేయడంతో, సిబ్బంది, తోటి ప్రయాణికులు కలిసి అతన్ని సీటుకు డక్ట్ టేప్‌తో కదలకుండా కట్టిపడేసారు. విమానం బయలుదేరిన రెండు గంటల తర్వాత ఈ గొడవ మొదలైంది. ప్రయాణికులంతా ప్రశాంతంగా ఉన్న సమయంలో, సడన్‌గా ఒక వ్యక్తి ఎలాంటి చప్పుడు లేకుండా పక్క సీటులో కూర్చున్న వ్యక్తి పై దాడి చేశాడు.
సిబ్బంది, ప్రయాణికుల సాహసం:
ఈ గొడవను చూసి రిచర్డ్ ఓలెనిక్, జువాన్ మెజియా అనే మాజీ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు వెంటనే అప్రమత్తమైయ్యారు. విమాన సిబ్బంది ఆ వ్యక్తిని కంట్రోల్ చేయడానికి, సీటులో కదలకుండా ఉండటానికి సీటుతో గట్టిగా 'డక్ట్ టేప్' చుట్టి కట్టేశారు. ఓలెనిక్ తీసిన ఫోటోలో ఆ వ్యక్తి చేతులు, శరీరం చుట్టూ టేప్ చుట్టి ఉన్నట్లు స్పష్టంగా కనిపించింది.
విమానం దారి మళ్లింపు:
ఈ గొడవకు ముందు, విమాన సిబ్బంది ఆ ప్రయాణికుడిని కాంట్రోల్ చేసేందుకు ప్రయత్నించినా అతను వినలేదు. అంతేకాకుండా, సిబ్బందిపై అసభ్యకరంగా, జాతి వివక్షతో కూడిన దూషణలకు పాల్పడ్డాడు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో పైలట్లు విమానాన్ని వెంటనే మేరీల్యాండ్‌లోని బాల్టిమోర్ విమానాశ్రయానికి దారి మళ్లించారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే పోలీసులు ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత విమానం ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించి నెవార్క్‌కు చేరుకుంది.
ALSO READ : జీ మీడియా అధినేతపై సుభాష్ చంద్రపై CBI కేసు
ఎఫ్‌బిఐ దర్యాప్తు:
ప్రయాణికులు, సిబ్బంది భద్రతకే మా మొదటి ప్రాధాన్యత అని అమెరికన్ ఎయిర్‌లైన్స్ స్పష్టం చేసింది. ఇలాంటి హింసాత్మక ప్రవర్తనను ఎంతమాత్రం సహించబోమని తేల్చిచెప్పింది. ప్రస్తుతం ఈ ఘటనపై ఎఫ్‌బిఐ (FBI) రంగంలోకి దిగి విచారణ జరుపుతోంది. సాక్షుల నుంచి వివరాలు సేకరిస్తున్నామని, యూఎస్ అటార్నీ కార్యాలయంతో మాట్లాడి ఆ వ్యక్తిపై ఫెడరల్ చట్టాల ప్రకారం అభియోగాలు మోపే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కోర్టులో నిరూపితమయ్యే వరకు ఇవి ప్రస్తుతానికి ఆరోపణలు మాత్రమేనని స్పష్టం చేశారు.
A passenger was duct-taped to his seat after allegedly making racist and anti-gay remarks on an American Airlines flight.
— Complex (@Complex) September 4, 2026
According to TMZ, the man allegedly used the N-word toward a Black flight attendant and became violent, hitting another passenger and pushing a woman who… pic.twitter.com/GuqwkeEdoh
