యాదాద్రి, వెలుగు : ఫేక్ సంఘాలను సృష్టించి లోన్లు తీసుకున్న వ్యవహారంలో మెప్మా ఏపీడీపై బదిలీ వేటు పడింది. పీడీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో సభ్యులు లేకున్నా 38 సంఘాలు ఏర్పాటు చేసి కెనెరా బ్యాంకులో రూ. 7.99 కోట్లు లోన్లు తీసుకున్న సంగతి తెలిసిందే.
ఈ వ్యవహారంపై యాదాద్రి అడిషనల్ కలెక్టర్ ఏ భాస్కరరావు విచారణ జరిపించి, పలువురు ఆర్పీలపై ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. తాజాగా మెప్మా ఏడీఎంసీ శ్యామలపై బదిలీ వేటు పడింది. ఆమెను భువనగిరి నుంచి మోత్కూరుకు బదిలీ చేశారు. ఏడీఎంసీ బాధ్యతలను కూడా డీఎంసీ రమేశ్‌కు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
