అంతర్జాతీయంగా ముదురుతున్న ఉద్రిక్తతల వేళ బులియన్ మార్కెట్లు ఈ వారం ప్రారంభం నుంచి దూసుకుపోతున్నాయి. నిన్న మెున్నటి వరకూ స్వల్పంగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు బుధవారం రోజున భారీగా పెరిగి అందరికీ షాక్ ఇచ్చాయి. దీంతో ఆభరణాలు షాపింగ్ చేద్దాం అనుకుంటున్న తెలుగు ప్రజలు తమ నగరాల్లోని రిటైల్ విక్రయ ధరలను ముందుగా పరిశీలించటం బెటర్.
జూలై 22న బంగారం రేట్లు పెరిగాయి. జూలై 21 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.229 పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 651గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 430గా కొనసాగుతోంది.
ALSO READ : రష్యా దౌత్యవేత్తకు కేంద్రం సమన్లు..
బుధవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. జూలై 22, 2026న దేశవ్యాప్తంగా కేజీకి రూ.5వేలు పెరిగింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.2లక్షల 45వేలుగా అమ్మబడుతోంది. అంటే గ్రాము దాదాపు రూ.245 దగ్గర ఉంది.
