ఫెస్టివల్ సీజన్‌లో షాపింగ్ ఖర్చులు తగ్గించుకోవడానికి స్మార్ట్ క్రెడిట్ కార్డ్ టిప్స్!

ఫెస్టివల్ సీజన్‌లో షాపింగ్ ఖర్చులు తగ్గించుకోవడానికి స్మార్ట్ క్రెడిట్ కార్డ్ టిప్స్!

పండగ సీజన్ వస్తోందంటే చాలు షాపింగ్ ఖర్చులు అమాంతం పెరుగుతాయి. క్రెడిట్ కార్డులను సరైన రీతిలో ఉపయోగిస్తే అదనపు భారాన్ని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా కాస్ట్-బెనిఫిట్ కోసం క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డులు ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే ఏకరీతిగా అన్నిటికీ ఒకే కార్డు వాడకుండా.. మీ షాపింగ్ అలవాట్లకు తగినట్లుగా సరైన కార్డును ఎంచుకోవడం చాలా ముఖ్యం.

ఖర్చు చేసే ముందు మీ స్పెండింగ్ అలవాట్లను పూర్తిగా విశ్లేషించుకోవాలి. గాడ్జెట్లు, బట్టలు, డైనింగ్, ట్రావెల్ వంటి ఖర్చుల కేటగిరీలకు తగినట్లుగా రివార్డులు, క్యాష్‌బ్యాక్ అందించే కార్డులను ఎంచుకోవాలి. ప్లాన్ చేసిన కొనుగోళ్లకు వీటిని వాడి, బిల్లును ఎప్పటికప్పుడు పూర్తిగా చెల్లిస్తే షాపింగ్ ఖర్చులను మనం ఊహించిన దానికంటే ఎక్కువగానే తగ్గించుకోవచ్చు.

కేవలం అత్యధిక క్యాష్‌బ్యాక్ ప్రకటనలను చూసి మోసపోకూడదని బ్యాంక్‌బజార్ సీఈఓ అధిల్ శెట్టి హెచ్చరిస్తున్నారు. మీరు ఎప్పుడూ వాడని కేటగిరీపై వచ్చే 5% క్యాష్‌బ్యాక్ కంటే.. రోజూ రెగ్యులర్‌గా ఖర్చు చేసే విభాగాలపై లభించే 2% క్యాష్‌బ్యాక్ కార్డు ఎంతో బెటర్. కార్డు ఎంచుకునేటప్పుడు క్యాష్‌బ్యాక్ లిమిట్స్, మినహాయింపులు, రిడెంప్షన్ షరతులు, అలాగే యాన్యువల్ ఫీ వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించడం తప్పనిసరి.

ALSO READ : AIకి అసలు నీళ్లెందుకు..? సముద్రాలు ఎండిపోయేలా డేటా సెంటర్లు చేస్తున్నాయా?

పండుగ ఆఫర్లు తాత్కాలిక లాభాలను మాత్రమే ఇస్తాయి. కాబట్టి కేవలం సీజనల్ ఆఫర్ల కోసం కాకుండా ఏడాది పొడవునా మెరుగైన ప్రయోజనాలను అందించే కార్డులను ఎంచుకోవాలి. అప్పుడే వార్షిక రుసుము చెల్లించడం వల్ల నిజంగా లాభం పొందటం సాధ్యమవుతుంది. కాబట్టి పండగ షాపింగ్‌ను మరింత స్మార్ట్‌గా, పొదుపుగా మార్చుకోవడానికి మీ ఖర్చులకు సరిపోయే బెస్ట్ క్రెడిట్ కార్డును ఇప్పుడే ఎంచుకోండి.