సినిమా ఛాన్స్ పేరుతో లైంగిక వేధింపులు.. ఢీ10 షో విన్నర్ రాజు అరెస్ట్

సినిమా  ఛాన్స్ పేరుతో లైంగిక వేధింపులు.. ఢీ10 షో విన్నర్  రాజు అరెస్ట్

హైదరాబాద్:   లైంగికంగా వేధించాడంటూ ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ‘ఢీ’ డ్యాన్స్‌ షోకు చెందిన డ్యాన్సర్ రాజును మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.

యువతి  సెప్టెంబర్  9న మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సినిమా అవకాశాల పేరుతో రాజు తనను లైంగికంగా వేధించాడని ఆమె ఫిర్యాదులో తెలిపింది.  ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.  న్యాయస్థానం రాజుకు రిమాండ్ విధించింది. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

అయితే ఒక సెలబ్రిటీకి సంబంధించిన లైంగిక వేధింపుల కేసును పోలీసులు గోప్యంగా ఉంచడం, ఈ నెల 9నే అరెస్ట్ చేసినా ఆలస్యంగా సమాచారం వెలుగులోకి రావడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.