‘సర్’ను గడువులోగా పూర్తి చేయాలి.. గద్వాల కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

‘సర్’ను గడువులోగా పూర్తి చేయాలి.. గద్వాల కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

గద్వాల, వెలుగు: నిర్దేశిత గడువులోగా ‘సర్’​ను వంద శాతం పూర్తి చేయాలని జోగులాంబ గద్వాల కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం తహసీల్దార్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇప్పటివరకు 79.75 శాతం డిజిటలైజేషన్ పూర్తయిందని, మిగిలిన పనిని సకాలంలో పూర్తి చేయాలన్నారు.

ముఖ్యంగా గద్వాల అర్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తక్కువ శాతం మాత్రమే డిజిటలైజేషన్ జరిగినందున, వార్డ్ ఆఫీసర్లు మరియు వాలంటీర్ల సహకారంతో ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, జిల్లాలో పీడీఎస్ బియ్యం పక్కదారి పట్టకుండా నిఘా ఉంచాలని ఆదేశించారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మధుమోహన్, ఆర్డీవో శ్రీనివాసరావు, ట్రైని డిప్యూటీ కలెక్టర్లు మనోజ్ కుమార్ రెడ్డి, రాజ్ కుమార్ పాల్గొన్నారు.