మహిళల్లారా ఒంటరిగా క్యాబ్ ఎక్కుతున్నారా.. అయితే ఈ వార్త మీ కోసమే.... నైట్ డ్యూటీ మహిళా ఎంప్లాయిస్ కు కష్టాలు తప్పడం లేదు. హైదరాబాద్ శంషాబాద్ లో దారుణ ఘటన జరిగింది. ఇండిగో విమానయాన సంస్థ లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన నగరంలో తీవ్ర కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు రాత్రి సమయంలో డ్యూటీ కోసం తన ఇంటి నుంచి ఎయిర్‌పోర్టుకు క్యాబ్‌లో బయలుదేరింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపానికి చేరుకోగానే, నిందితుడు క్యాబ్‌ను నిర్మానుష్య ప్రాంతంలోకి మళ్లించి.. కారులోనే అత్యాచారానికి ప్రయత్నించాడు. బాధితురాలు అతడిని ప్రతిఘటించి.. తిరగబడింది.
దీంతో భయపడిన క్యాబ్ డ్రైవరు, కారుతో పరారయ్యాడు. తరువాత ఆ మహిళ శంషాబాద్ ఎయిర్ పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపుచర్యలు చేపట్టి.. సిద్ధాంతి దగ్గర అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
