లక్షెట్టిపేట: మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని MRO ఆఫీస్ ముందు ఒక్కసారిగా అకస్మాత్తుగా భారీ వేప చెట్టు కూలింది. రన్నింగ్లో ఉన్న కారుపై భారీ వృక్షం పడటంతో కారు నుజ్జునుజ్జు అయింది. కారులో ఒక్కరే ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. కారులో ఉన్న వ్యక్తి సేఫ్గా బయటపడ్డాడు.
కొన్ని యేండ్ల వేప చెట్టు చెదలు పట్టడంతో ఇలా కూలిందని స్థానికులు తెలిపారు. కారు లక్షెట్టిపేటకి చెందిన వై శ్రీనివాస్ అనే వ్యక్తికి చెందినగా గుర్తించారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
