చెన్నై: తమిళనాడులో విషాద ఘటన జరిగింది. తమిళనాడులోని నామక్కల్ జిల్లా తిరుచెంగోడ్ సమీపంలోని సక్కరంపాలయం జంక్షన్ దగ్గర గురువారం సాయంత్రం ఒక కాలేజ్ బస్సు బైక్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న నలుగురు బాలికలు స్పాట్లోనే చనిపోయారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బాలికలు చనిపోవడంతో బాధిత కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
Tiruchengode 🚨⚠️
— Dave (Road Safety: City & Highways) (@motordave2) September 4, 2026
Disturbing Visuals🚨
4 on a 2 wheeler behind College Bus, taking right turn next to petrol bunk with blocked vision, headON with other Bus.
Always look ahead & behind, before taking any such turns.@DriveSmart_IN https://t.co/8hVIFtjdhE
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. శేఖర్, అమృత దంపతులకు ముగ్గురు కూతుర్లు. పెద్ద కూతురి పేరు సవిత. 19 ఏళ్ల ఈ సవిత (అలియాస్ కలైసెల్వి).. తన ముగ్గురు చెల్లెళ్లను ఎలాచిపాలయం ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి ఇంటికి తీసుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. సవితతో పాటు నివేత (17), 7వ తరగతి చదువుతున్న ధనుశ్రీ (13), వారి చిన్నాన్న రమేష్ బాబు కుమార్తె, 6వ తరగతి చదువుతున్న 12 ఏళ్ల అభినయ కూడా బైక్పై ఉన్నారు.
రాశిపురం నుంచి వస్తున్న ముత్తయ్యమ్మాళ్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన బస్సు, సక్కరంపాలయం జంక్షన్ దగ్గర ఉన్న మలుపులో వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న నలుగురు బాలికలు మరణించారు.
►ALSO READ | జమ్మూ కాశ్మీర్లో ఎన్ కౌంటర్.. సైన్యం చేతిలో టెర్రరిస్ట్ హతం
ఎలాచిపాలయం పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం తిరుచెంగోడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. బస్సు డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను తెలుసుకోవడానికి దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. గురువారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది.
