రైల్వేలో 4,098 ఉద్యోగాలు.. డిగ్రీ, డిప్లొమా ఉంటే చాలు.. ఇంజినీరింగ్, సైన్స్ గ్రాడ్యుయేట్లకు గోల్డెన్ ఛాన్స్..

రైల్వేలో 4,098 ఉద్యోగాలు.. డిగ్రీ, డిప్లొమా ఉంటే చాలు.. ఇంజినీరింగ్, సైన్స్ గ్రాడ్యుయేట్లకు గోల్డెన్ ఛాన్స్..

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (RRB) జూనియర్ ఇంజినీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS), కెమికల్ & మెటలర్జికల్ అసిస్టెంట్ (CMA) పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4,098 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టు పేరు: జూనియర్ ఇంజినీర్ (జేఈ), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్(డీఎంఎస్), కెమికల్ & మెటలర్జికల్ అసిస్టెంట్ (సీఎంఏ).

మొత్తం ఖాళీలు: 4098. 

ఎలిజిబిలిటీ
జేఈ: గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో డిప్లొమా/ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

డీఎంఎస్: అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్/ టెక్నికల్ విద్యార్హత కలిగి ఉండాలి.

సీఎంఏ: కెమిస్ట్రీ/ మెటలర్జికల్ విభాగంలో డిప్లొమా/ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.  

వయోపరిమితి: 18 నుంచి 33 ఏళ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: ఆగస్టు 14. 

లాస్ట్ డేట్: సెప్టెంబర్ 9. 

సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.rrbapply.gov.inను సందర్శించండి.