చాంగ్‌జౌ: ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు.. చైనా ఓపెన్ సూపర్–1000 టోర్నీలో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన విమెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో సింధు 21–14, 9–21, 21–10తో ఉన్నతి హుడాపై గెలిచింది. 56 నిమిషాల మ్యాచ్‌లో ఉన్నతి నుంచి సింధుకు గట్టి పోటీ ఎదురైంది. చెరో గేమ్ గెలవడంతో మ్యాచ్ ఉత్కంఠకు దారి తీసింది. అయితే డిసైడర్‌లో సింధు తన అనుభవాన్ని ఉపయోగించి ర్యాలీలు, స్మాష్‌లతో ఉన్నతిని కట్టడి చేసింది.
మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో ఆయుష్ శెట్టి 17–21, 21–5, 21–17తో వరల్డ్ 11వ ర్యాంకర్ అలవి ఫర్హాన్ (ఇండోనేసియా)పై సంచలన విజయం సాధించాడు. మెన్స్ డబుల్స్‌లో హరిహరన్–అర్జున్ 16–21, 7–21తో లియాంగ్ వే కెంగ్ –వాంగ్ చాంగ్ (చైనా) చేతిలో, మిక్స్‌డ్ డబుల్స్‌లో రోహన్ కపూర్–రుత్విక శివాని 9–21, 16–21తో ఫెంగ్ యాన్ జి–హుయాంగ్ డాంగ్ పెంగ్ (చైనా) చేతిలో, ధ్రువ్ కపిల–తానీషా క్రాస్టో18–21, 19–21తో గుయో జిన్ వా–చెన్ ఫెంగ్ హుయ్ (చైనా) చేతిలో ఓడారు.
