కొల్లాపూర్లో ఫారెస్ట్ రేంజ్ ట్రైనీ అధికారుల శిక్షణ పూర్తి

కొల్లాపూర్లో ఫారెస్ట్ రేంజ్ ట్రైనీ అధికారుల శిక్షణ పూర్తి

కొల్లాపూర్, వెలుగు: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని కొల్లాపూర్ రేంజ్ అటవీ ప్రాంతంలో హైదరాబాద్ ఫారెస్ట్ అకాడమీకి చెందిన వివిధ రాష్ట్రాల 54 మంది ఫారెస్ట్ రేంజర్ ట్రైనీ అధికారులకు నిర్వహించిన ఐదు రోజుల శిక్షణా శిబిరం బుధవారం సోమశిల ఎకో పార్క్‌‌‌‌ లో విజయవంతంగా ముగిసింది.

ఈ శిక్షణలో భాగంగా ట్రైనీ అధికారులు రోజూ సుమారు 12 కిలోమీటర్లు అడవిలో నడుస్తూ వన్యప్రాణుల సంరక్షణ, అటవీ నిర్వహణ, పరిరక్షణ, క్షేత్రస్థాయి విధులపై ప్రత్యక్ష అవగాహన సాధించారు. నాగర్‌‌‌‌కర్నూల్ డీఎఫ్‌‌‌‌ఓ రేవంత్ చంద్ర, అకాడమీ శిక్షణ అధికారి రేఖా భాను, అచ్చంపేట ఎఫ్‌‌‌‌డీఓ చంద్రశేఖర్‌‌‌‌లతో పాటు ఇతర అటవీ అధికారులు క్షేత్రస్థాయిలో విధి నిర్వహణపై పలు సూచనలు చేశారు. తమకు అందించిన శిక్షణ, సహకారానికి ఫారెస్ట్ అకాడమీ ట్రైనీ రేంజర్లు అటవీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.