యాదగిరిగుట్ట, వెలుగు: వర్షాలు సమృద్ధిగా కురవాలని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో వర్ష పాశుపత వరుణ యాగం మంగళవారం రెండో రోజుకు చేరుకుంది. ఆలయ అనుబంధ క్షేత్రమైన శ్రీపర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి(శివాలయం)ఆలయంలో ఈ క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు.
యాగం, మండ పారాధన, కలశ స్థాపన,ఋష్య శృంగ విగ్రహ స్థాపన, ప్రత్యేక జపాలు, పారాయణాలు, అగ్నిప్రతిష్ఠ, పూర్వాంగ విధులు జరిపించారు. ఆలయ ఈవో భవానీ శంకర్, శివాలయ ప్రధాన పురోహితుడు గౌరీభట్ల సత్యనారాయణ శర్మ, ప్రధానార్చకులు నరసింహ రామశర్మ, ఉప ప్రధాన పురోహితుడు శ్రీధర్ శర్మ, అర్చకులు నరసింహమూర్తి, సాయికృష్ణ శర్మ, శ్రీనివాస్ శర్మ, నాగరాజు శర్మ, నరసింహమూర్తి శర్మ, పవన్ శర్మ ఉన్నారు.
