వేములవాడలో పార్క్చేసిన బైక్లో రూ.3.50 లక్షలు చోరీ

వేములవాడలో పార్క్చేసిన బైక్లో రూ.3.50 లక్షలు చోరీ

వేములవాడ, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పార్క్ చేసిన బైక్‌‌లో నుంచి రూ.3.50 లక్షలు చోరీకి గురయ్యాయి. వేములవాడ రూరల్ మండలం బాలరాజుపల్లికి చెందిన నాగుల నాగరాజు తన వద్ద ఉన్న రూ.2.40 లక్షలకు తోడు పట్టణంలోని కేడీసీసీబీ బ్యాంకులో నుంచి రూ.1.10 లక్షలు డ్రా చేశాడు.

మొత్తం రూ.3.50 లక్షలను బైక్‌‌లో ఉంచుకుని విద్యానగర్‌‌లో ప్లాట్‌‌కు సంబంధించిన నగదు చెల్లించేందుకు వెళ్లాడు. ఓ ఇంటి ముందు బైక్ పార్క్ చేసి లోపలికి వెళ్లి తిరిగి వచ్చేసరికి నగదు కనిపించలేదు. సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో గుర్తుతెలియని వ్యక్తులు నగదు ఎత్తుకెళ్తున్న దృశ్యాలు రికార్డైనట్లు సమాచారం.

బాధితుడి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పరిసర ప్రాంతాల సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నామని టౌన్​ సీఐ వీరప్రసాద్ తెలిపారు.