ట్రక్కుల్లో రాళ్లు తీసుకొస్తుంది పోలీసులు.. రాళ్లు విసురుతున్నది బీజేపీ గూండాలు: CJP చీఫ్

ట్రక్కుల్లో రాళ్లు తీసుకొస్తుంది పోలీసులు.. రాళ్లు విసురుతున్నది బీజేపీ గూండాలు: CJP చీఫ్

ఢిల్లీ: CJP నిరసనలను భగ్నం చేయడానికి, రాళ్లు రువ్వడానికి బీజేపీ కుట్రపూరితంగా మనుషులను పంపిస్తోందని కాక్రోచ్ జనతా పార్టీ అధినేత అభిజిత్ దీప్కే ఆరోపించారు. తాము నెల రోజులుగా ఇక్కడే కూర్చున్నామని, నెల రోజుల్లో ఇలాంటి ఘటనేదీ జరగలేదని.. కానీ ఇప్పుడు నిరసనలు తీవ్రతరం కావడంతో అణచివేయడానికి బీజేపీ బయటి నుంచి గూండాలను పంపిస్తోందని CJP చీఫ్ ఆరోపించారు.

రాళ్లు విసురుతున్నది బీజేపీకి చెందిన వాళ్లేనని, పోలీసులు ఇక్కడికి ట్రక్కుల్లో రాళ్లు తీసుకొస్తారని.. బీజేపీ గూండాలు వచ్చి రాళ్లు విసిరి, ఆ తర్వాత రాళ్లు రువ్వింది నిరసనకారులేనని CJPని, యువతను అప్రతిష్టపాలు చేస్తారని దీప్కే సంచలన ఆరోపణలు చేశారు.

పోలీసుల లాఠీఛార్జ్ 'చాలా క్రూరంగా' ఉందని.. ఈ లాఠీ ఛార్జ్కు పాల్పడిన పోలీసు అధికారులను కోర్టుకు లాగుతామని దీప్కే అన్నారు. అలాగే.. సోనమ్ వాంగ్‌చుక్‌ను తన నిరాహార దీక్షను విరమించుకోవాలని తాము కోరుతున్నామని ఆయన స్పష్టం చేశారు. CJP నిరసన 34వ రోజుకు చేరుకోగా, వాంగ్‌చుక్ నిరాహార దీక్ష 26వ రోజుకు చేరిందని దీప్కే తెలిపారు. తమ డిమాండ్లు నెరవేరే వరకూ నిరసన కొనసాగుతుందని అభిజిత్ దీప్కే స్పష్టం చేశారు.

►ALSO READ | ఒక డీసీపీ స్థాయి వ్యక్తికి ఇది తగునా..? మహిళపై చేయి చేసుకున్న ఆఫీసర్ జంతర్ మంతర్ విధుల నుంచి ఔట్

NEET పేపర్ లీక్, విద్యా వ్యవస్థలో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితులకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని CJP నిరసన చేస్తున్న సంగతి తెలిసిందే. దేశంలోని విపక్ష పార్టీలు కూడా ఇదే డిమాండ్తో పార్లమెంట్ను స్తంభింపజేయడంతో ఈ నిరసనలపై దేశవ్యా్ప్త చర్చ జరుగుతోంది.