శ్రీవాణి దర్శన టికెట్ల భక్తుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ. తిరుమలలోనే శ్రీవాణి దర్శన టికెట్లు జారీ చేసేలా చర్యలు చేపట్టింది టీటీడీ. ప్రస్తుతం శ్రీవాణి దర్శన టికెట్లు మూడు నెలల ముందు 500, ఆన్లైన్లో ప్రతిరోజు 500, కరెంటు బుకింగ్ లో మరో 300, గతంలో విరాళాలు ఇచ్చి టికెట్లు పొందిన వారి కోసం కేటాయిస్తుండగా...మరో 200 టికెట్లు తిరుపతి ఎయిర్పోర్ట్ లో ఆన్ లైన్ ద్వారా కేటాయిస్తున్నారు.
ప్రస్తుతం మూడు నెలలు ముందు టికెట్లు కొన్నవారికి గదులు కేటాయిస్తోంది టీటీడీ. కరెంటు బుకింగ్ టికెట్లు పొందిన వారికి అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు దర్శనం కల్పిస్తున్నారు. ఈ క్రమంలో ఉదయం 9 గంటలకు దర్శన టికెట్లు పొందిన భక్తుడు సాయంత్రం వరకు వేచి ఉండాల్సి వస్తుంది.
►ALSO READ | శ్రీవారి భక్తులకు అలర్ట్: అక్టోబర్ నెల దర్శన , గదుల కోటా విడుదల..
సాయంత్రం వరకు వారికి గదులు ఉండేట్టు చూసే విధంగా ఎయిర్పోర్ట్ లాంఙ్ తరహాలో నిర్మాణం చేపట్టాలని సన్నాహాలు చేస్తోంది టీటీడీ. ఇందుకు తిరుమలలోని అన్నమయ్య భవనానికి దగ్గర్లో ఉన్న న్యూ వుడ్సైడ్ హోటల్లో ప్రాంగణాన్ని లాంజ్ గా తీర్చిదిద్దాలని నిర్ణయించింది టీటీడీ.
