ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఆగస్టు 1న ప్రారంభించనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాల్సిందిగా ప్రధాని మోదీని సీఎం చంద్రబాబు అధికారికంగా ఆహ్వానించారు. చంద్రబాబు వెంట కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మ, ఎంపీలు, లావు శ్రీకృష్ణ దేవరాయలు, కలిశెట్టి అప్పలనాయుడు ఉన్నారు.
ఏపీకి సంబంధించిన కేంద్ర నిధుల విడుదల, మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం నుంచి లభించాల్సిన సహాయ సహకారాలపై ప్రధానితో చర్చించినట్లు సమాచారం. మోదీని కలిసిన తర్వాత సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు సీఆర్ పాటిల్,పీయూష్ ఘోయల్, మనోహర్ లాల్ ఖట్టర్ తో కూడా భేటీ అయ్యారు.
►ALSO READ | ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు: హైదరాబాదీలకు బిగ్ అలర్ట్
