తిరుమలలో 'పెద్ది' పోస్టర్ కలకలం.. భద్రతా వైఫల్యంపై భక్తుల ఆగ్రహం

తిరుమలలో 'పెద్ది' పోస్టర్ కలకలం.. భద్రతా వైఫల్యంపై భక్తుల ఆగ్రహం

తిరుమలలో మరోసారి భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  లేటెస్ట్ గా శ్రీవారి దర్శనం కోసం అలిపిరి నడక మార్గంలో ఓ మహిళ  'పెద్ది' సినిమా పోస్టర్‌తో హల్ చల్ చేసింది.  సినిమా ఘన విజయం సాధించిన సందర్భంగా మొక్కు తీర్చుకునేందుకు ఆమె కాలి నడకన తిరుమలకు వచ్చినట్లు పోస్టర్‌లోని సందేశం ద్వారా తెలుస్తోంది. అయితే తిరుమలలో రాజకీయ, సినిమా లేదా వాణిజ్య ప్రచారాలకు అనుమతి లేదు. అయినా కాలి నడక పోస్టర్ తో సదరు మహిళ రావడం  వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనపై భక్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

నడక మార్గంలోని మోకాళ్ల పర్వతం గోపురం వద్ద  మహిళ 'పెద్ది ' పోస్టర్‌తో ఫొటోలకు పోజులిచ్చింది.  దీనికి సంబంధించిన ఆ దృశ్యాలను పలువురు వీడియోలు, ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అవి వైరల్‌గా మారాయి. దీంతో తిరుమలలో అమలవుతున్న భద్రతా తనిఖీలపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత పెద్ద పోస్టర్‌తో నడక మార్గంలో ప్రయాణించినా భద్రతా సిబ్బంది ఎందుకు గుర్తించలేకపోయారని భక్తులు ప్రశ్నిస్తున్నారు.

►ALSO READ | Prabhas: దేశమంతా 'డార్లింగ్' మంత్రమే.. బాక్సాఫీస్ వద్ద నంబర్ 1 స్థానంలో ప్రబాస్ రికార్డు!

తిరుమల శ్రీవారి క్షేత్ర పవిత్రతను కాపాడేందుకు ప్రచార కార్యక్రమాలపై ఇప్పటికే స్పష్టమైన నిబంధనలు అమల్లో ఉన్నాయి. అయినప్పటికీ వరుసగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం భక్తుల్లో ఆందోళన నెలకొంది. ఆలయ ప్రాంగణం, నడక మార్గాల్లో నిఘాను మరింత కట్టుదిట్టం చేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు, నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.