CJP నిరసనకారులపై లాఠీచార్జ్‌పై కేంద్రానికి, పోలీసులకు హైకోర్ట్ నోటీసులు.. నాలుగు వారాల డెడ్ లైన్..!

CJP నిరసనకారులపై లాఠీచార్జ్‌పై కేంద్రానికి, పోలీసులకు హైకోర్ట్ నోటీసులు.. నాలుగు వారాల డెడ్ లైన్..!

న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ పార్లమెంట్ మార్చ్ సందర్భంగా నిరసనకారులపై సాగించిన హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం, పోలీసులకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, పోలీసులను ఆదేశించింది. ఈలోగా ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, వీడియోగ్రఫీ, బాడీ క్యామ్ ఫుటేజ్, ఇతర సంబంధిత రికార్డులను భద్రపరచాలని కోర్టు ఆదేశించింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణ సెప్టెంబర్ 11కు వాయిదా వేసింది. 

అసలేం జరిగిందంటే..?

నీట్ 2026 పేపర్ లీక్, నీట్ అభ్యర్థుల మరణాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జులై 20న కాక్రోచ్ జనతా పార్టీ పార్లమెంట్ మార్చ్ (చలో సంసద్)కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ పార్లమెంట్ మార్చ్ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసి హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులపై పోలీసులు విచక్షణరహితంగా లాఠీచార్జ్ చేశారు.

నిరసనను అణిచివేసేందుకు ఆందోళనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ క్రమంలోనే శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తోన్న సీజేపీ ఆందోళనకారులపై పోలీసుల మితిమీరిన బల ప్రయోగాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‎పై అత్యవసర విచారణ చేపట్టి ఆందోనకారులకు న్యాయ సహయం అందించాలని పిటిషనర్ అభ్యర్థించారు.

►ALSO READ | ఆ హామీ ఇస్తేనే వెంటనే దీక్ష విరమిస్తా..కేంద్రానికి సోనమ్ వాంగ్‌చుక్ బిగ్ కండిషన్..

ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కరియాలతో కూడిన ధర్మాసనం బుధవారం (జులై 22)  ఈ పిటిషన్‎పై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. సీజేపీ పార్లమెంట్ మార్చ్ సందర్భంగా నిరసనకారులపై లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించిన ఘటనలపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం, పోలీసులకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 

నాలుగు వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, పోలీసులను ఆదేశించింది. ఈలోగా ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, వీడియోగ్రఫీ, బాడీ క్యామ్ ఫుటేజ్, ఇతర సంబంధిత రికార్డులను భద్రపరచాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణ సెప్టెంబర్ 11కు వాయిదా వేసింది.