కొత్తగూడ, వెలుగు: తన ఫోన్‌కు వచ్చిన ఏపీకే ఫైల్ క్లిక్ చేయడంతో ఓ యువకుడి ఖాతా నుంచి రూ.85 వేలు కట్ అయిన ఘటన ఆదివారం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడె మండల కేంద్రంలో జరిగింది. ఎస్సై రాజ్‌కుమార్ వివరాల ప్రకారం.. కొత్తగూడకు చెందిన షేక్ అసిఫ్ ఫోన్‌కు వచ్చిన ఏపీకే ఫైల్‌ను క్లిక్ చేయడంతో సైబర్ నేరగాళ్లు ఫోన్‌ను హ్యాక్ చేసి బ్యాంకు ఖాతా నుంచి రూ.85 వేలు కాజేశారు.
అనంతరం అతడి వాట్సాప్‌ను కూడా హ్యాక్ చేసి, అందులోని నంబర్లకు మెసేజ్‌లు పంపి డబ్బులు కాజేసేందుకు ప్రయత్నించారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు వెంటనే ఖాతాను హోల్డ్ చేయించి సైబర్ కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై రాజ్‌కుమార్ మాట్లాడుతూ అపరిచితుల నుంచి వచ్చే ఏపీకే ఫైల్స్, అనుమానాస్పద మెసేజ్‌లను ఓపెన్ చేయొద్దని సూచించారు. అపరిచితులకు ఓటీపీలు, బ్యాంకు వివరాలు వెల్లడించవద్దని హెచ్చరించారు.
