గ్రేటర్ వరంగల్, వెలుగు: జీవితాంతం కుటుంబం కంటే సమాజం కోసం పాటుపడిన ఉద్యమకారిణి రహీమున్నీసా బేగంకు అండగా ఉంటామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రహీమున్నీసా బేగంను ఎమ్మెల్యే పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలు, సమాజం కోసం ముందుండి పోరాడిన రహీమున్నీసా బేగం అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసి పరామర్శించినట్లు తెలిపారు. ఆమె వైద్యానికి అయ్యే ఖర్చు విషయంలో కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
