మాల కులానికి ప్రత్యేక సీరియల్ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేటాయించాలి..సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మాల ఉపకులాల సమావేశం

మాల కులానికి ప్రత్యేక సీరియల్ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేటాయించాలి..సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మాల ఉపకులాల సమావేశం

ముషీరాబాద్,వెలుగు: ఎస్సీ వర్గీకరణ వల్ల నష్టపోతున్న మాల కులానికి ప్రత్యేక సీరియల్ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేటాయించాలని మాల మహానాడు డిమాండ్ చేసింది. మాదిగలకు గ్రూప్ 1, గ్రూప్ 2 చేసిన విధంగానే మాలలను రెండు గ్రూపులుగా చేయాలని కోరింది. 

ఆదివారం బాగ్‌‌‌‌‌‌‌‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రోస్టర్ విధానం వల్ల రిజర్వేషన్లు కోల్పోతున్న సందర్భంగా మాల, మాల 26 ఉపకులాల సమావేశం జరిగింది. మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గోపోజు రమేశ్‌‌‌‌‌‌‌‌బాబు అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరాజం, ప్రొఫెసర్ ఈశ్వరయ్య, సుధమల్ల వెంకటస్వామి, కొండ రాజలింగం హాజరై మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ వల్ల నష్టపోతోంది.. మాల ఉప కులాలేనన్నారు. 

దీనిపై ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి స్పందించి రోస్టర్ విధానాన్ని సవరించాలని, మాలలకు 20 లోపు రెండు రోస్టర్ పాయింట్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. మన్నే కులాన్ని తిరిగి మాల గ్రూపులో చేర్చాలని, మాలలకు ప్రత్యేకంగా 7 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో యాదగిరి, కృష్ణమూర్తి, రాందాస్, మన్నే శ్రీధర్ రావు, చెరుకు రామచందర్, అనంతరాములు, మాదాసు రాహుల్, నామ సైదులు, ఆనంద్, అనిత, అంజలి తదితరులు పాల్గొన్నారు.