కోటంచను పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతాం: భూపాలపల్లి ఎమ్మెల్యే

కోటంచను పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతాం: భూపాలపల్లి ఎమ్మెల్యే

జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: సుప్రసిద్ధ కోటంచ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఆదివారం ఆయన ఆలయ సమీపంలో కొనసాగుతున్న నిర్మాణాలను పరిశీలించారు. రాజగోపురం, హనుమాన్ ఆలయంతో పాటు మండపంలో చేపడుతున్న శిల్పాల పనులు స్పీడప్​ చేయాలని సూచించారు.

స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ నాయినేని సంపత్ రావు, ఆర్అండ్ బీ ఈఈ రమేశ్​బాబు, ఈవో బిల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.