పాల్వంచ, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో షార్ట్‌సర్క్యూట్‌తో ఓ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. కరకవాగు-గాజులగూడెం రహదారిలో నివాసం ఉంటున్న మహమ్మద్ ముబీన్ ఇంట్లో శనివారం అర్ధరాత్రి షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి.
ఇంట్లోని గృహోపకరణాలతో పాటు పిల్లల సర్టిఫికెట్లు, ఇంటి పత్రాలు, నగదు, బంగారం దగ్ధమయ్యాయి. మొత్తం రూ.20 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. కుటుంబ సభ్యులు ఊరికి వెళ్లిన సమయంలో స్థానికులు మంటలను గుర్తించి ముబీన్‌కు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
వారు చేరుకునేలోపే ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఆదివారం స్థానిక కార్పొరేటర్, వీఆర్వోతో పాటు వివిధ పార్టీల నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు.
