నల్లబెల్లి, వెలుగు: వరంగల్ జిల్లా సర్పంచుల జేఏసీ అధ్యక్షుడిగా నల్లబెల్లి మండలం నారక్కపేటకు చెందిన దండెం సంపత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మంత్రి, తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ గౌరవ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు జేఏసీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు యాదయ్య గౌడ్ ఆదివారం సంపత్‌కు నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా సంపత్ మాట్లాడుతూ జిల్లాలోని సర్పంచుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచుల సంఘం జేఏసీ నాయకులు, సర్పంచులు, మాజీ సర్పంచులు పాల్గొన్నారు.
