కరీంనగర్: కరీంనగర్ జిల్లా పరిషత్ కార్యాలయంలోని పోలింగ్ బూత్ వద్ద పోలీసుల లాఠీచార్జ్ చోటుచేసుకుంది. బిఆర్ఎస్ నేతలు దొంగ ఓట్లు వేస్తున్నారని అడ్డుకోడానికి వెళ్తే తమ పైన పోలీసులు దాడి చేశారని ఆరోపిస్తు బిజెపి కార్యకర్తలు నిరసనకు దిగారు. పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బీజేపీ కార్యకర్తలు బైఠాయించి ఆందోళన చేపట్టారు. BRS నేతలు 58 డివిజన్ లో దొంగ ఓట్లు వేయిస్తున్నారని తాము చెబుతుంటే పోలీసులు మాపైనే లాఠీఛార్జ్ చేయడం ఏంటని మండిపడుతూ ఆవేదన వ్యక్తం చేసారు. మరోవైపు కరీంనగర్ హుస్సేనీపురాలో 34వ డివిజన్లో దొంగ ఓట్లు వేయడానికి వచ్చారన్న అనుమానంతో ఇద్దరు యువకులను పోలీసులు పట్టుకున్నారు. అలాగే వారి ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
