కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త కార్మిక చట్టాలు, భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు, కార్మిక సంఘాలు రేపు (ఫిబ్రవరి 12) దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. సుమారు 10 ప్రముఖ కార్మిక సంఘాలు ఈ నిరసనలో పాల్గొంటున్నాయి. స్కూళ్లు, కాలేజీల సెలవుపై ప్రభుత్వం నుండి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. అయితే, రవాణా ఇబ్బందులు ఉండే అవకాశం ఉండటంతో చాలా చోట్ల విద్యాసంస్థలు మూసివేసే అవకాశం ఉంది.
రేపు తెరిచి ఉండేవి : అత్యవసర సేవలు (ఆసుపత్రులు, అంబులెన్స్ సేవలు), మెడికల్ షాపులు, పాలు & న్యూస్ పేపర్ సప్లయ్, అగ్నిమాపక కేంద్రాలు, విమాన సర్వీసులు, ATMలు.
రేపు బంద్ ప్రభావం ఉండేవి: బస్సులు, టాక్సీలు, ఆటోలు తక్కువగా తిరగవచ్చు. స్కూళ్లు & కాలేజీలకు సెలవు ప్రకటించే అవకాశం ఉంది. అలాగే మార్కెట్లు, కొన్ని ప్రైవేట్ షాపులు మూసివేయవచ్చు.
బంద్ ఎందుకంటే
కార్మికులు, రైతులు సంఘాలు కొత్తగా తెచ్చిన కార్మిక చట్టాలు విద్యుత్ సవరణ బిల్లు, విత్తన బిల్లును వెనక్కి తీసుకోవాలి. అలాగే ఉపాధి హామీ పథకాన్ని (MGNREGA) బలోపేతం చేయాలి. దీనితో పాటు ప్రతిపాదిత భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని ఆపాలి అని డిమాండ్ చేస్తున్నారు. సమాచారం ప్రకారం INTUC, AITUC, HMS, CITU, AIUTUC, TUCC, SEWA, AICCTU, LPF, UTUC అనే 10 కేంద్ర కార్మిక సంఘాలు ఈ ఉమ్మడి సమ్మెను ప్రకటించింది. సమ్మె చేస్తున్న కార్మిక సంఘాలకు ఆటోరిక్షా డ్రైవర్లతో పాటు బస్సు, కార్, లారీ డ్రైవర్లు సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు.
