K-4 మిసైల్‌ ప్రయోగం సక్సెస్‌.. 3 వేల 500 కి.మీ దూరంలోని టార్గెట్ను.. సముద్రం నుంచి కొట్టిపడేయొచ్చు !

K-4 మిసైల్‌ ప్రయోగం సక్సెస్‌.. 3 వేల 500 కి.మీ దూరంలోని టార్గెట్ను.. సముద్రం నుంచి కొట్టిపడేయొచ్చు !

న్యూక్లియర్ మిసైళ్లను అడ్డుకుని ధ్వంసం చేయగల అధునాతన కే4 బాలిస్టిక్ మిసైల్​ను బంగాళాఖాతంలోని అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిఘాత్ నుంచి ఇండియన్ నేవీ గురువారం విజయవంతంగా ప్రయోగించింది. ఈ క్షిపణి దాదాపు రెండు టన్నుల వార్‌హెడ్‌ను మోసుకెళ్లగలదని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. అణ్వస్త్రాలను కూడా మోసుకెళ్లగలిగే సామర్థ్యం ఉన్న కే4 బాలిస్టిక్ మిసైల్ 3 వేల 500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. డీఆర్డీవో తయారుచేసిన ఈ క్షిపణికి ఇప్పటివరకూ పలుమార్లు ట్రయల్స్ చేయగా, తాజాగా ఫుల్ రేంజ్ టెస్ట్ చేశారు.

కే15 బాలిస్టిక్ మిసైల్స్ను ఐఎన్ఎస్ అరిహంత్ నుంచి నేవీ గతంలోనే విజయవంతంగా పరీక్షించిన సంగతి తెలిసిందే. బాలిస్టిక్​ క్షిపణి అంటే.. భూమి గురుత్వాకర్షణ శక్తిని వినియోగించుకొని లక్ష్యాలను ఛేదించేవి. తొలుత బాహ్య అంతరిక్షంలోకి స్వయం చోదకశక్తి ద్వారా చేరి, తిరిగి వాతావరణంలోకి చేరి గురుత్వాకర్షణతో అధిక వేగంతో లక్ష్యాలను ఛేదిస్తుంది. జలాంతర్గామి నుంచి ప్రయోగించగల బాలిస్టిక్​ క్షిపణుల కుటుంబాన్ని కె–సమూహాల క్షిపణులుగా పరిగణిస్తారు.

►ALSO READ | మొత్తం పాకిస్తాన్‎నే కట్నంగా అడిగేశాడు: మాజీ ప్రధాని వాజ్‎పేయి కామెడీ టైమింగ్ వేరే లెవల్ భయ్యా..!

భారత రక్షణ వ్యవస్థలో క్షిపణి అభివృద్ధి కార్యక్రమం కీలకమైంది. 1958లో సైన్యానికి చెందిన టెక్నికల్​ డెవలప్​మెంట్​ ఎస్టాబ్లిష్​మెంట్స్​, డిఫెన్స్​ సైన్స్​ ఆర్గనైజేషన్​కు చెందిన డైరెక్టరేట్​ ఆఫ్​ టెక్నికల్​ డెవలప్​మెంట్​ ప్రొడక్షన్​ను కలిపి రక్షణ, పరిశోధన,అభివృద్ధి సంస్థ(డీఆర్​డీఓ) ఏర్పడింది. రక్షణ రంగంలో పరిశోధన అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం దీని ఉద్దేశం.