ఇండియాతో మ్యాచ్ పెద్ద మ్యాటరే కాదు.. చాలా లైట్: పాక్ ప్లేయర్ ఓవరాక్షన్

ఇండియాతో మ్యాచ్ పెద్ద మ్యాటరే కాదు.. చాలా లైట్: పాక్ ప్లేయర్ ఓవరాక్షన్

2026, ఫిబ్రవరి 15న ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ ఎదురుచూస్తోన్న ఇండియా, పాక్ మ్యాచ్ జరగనుంది. ఈ హై ఓల్టేజ్ పోరు గ్రౌండ్‎లో ఎలా ఉంటుందో గ్రౌండ్ బయట కూడా అంతే రసవత్తరంగా ఉంటుంది. మ్యాచుకు ముందే ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తాజాగా పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ ఈ డైలాగ్ వార్‎ను స్టార్ట్ చేశాడు. 

ఇండియాతో మ్యాచ్ లైట్ అని.. అది పెద్ద మ్యాటర్ కాదని ఓవరాక్షన్ చేశాడు. అన్ని మ్యాచుల్లాగే అది కూడా ఒక నార్మల్ మ్యాచ్ అని ప్రగల్భాలు పలికాడు. ఇప్పటి వరకు వరల్డ్ కప్‎లో ఆడిన రెండు మ్యాచులు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నామని.. ఇది మాకు ఆత్మ విశ్వాసాన్ని ఇస్తుందన్నాడు. భారత్‎తో ఆడటం తమకు ఇదే తొలిసారి కాదని.. గతంలో కూడా ఆ జట్టుతో ఆడామని చెప్పారు. 

►ALSO READ | T 20 World CUP: సౌతాఫ్రికా స్కోర్ 187.. బాగా కంట్రోల్ చేసిన ఆఫ్గనిస్తాన్ బౌలర్లు

ఈ సారి కొత్త మైండ్ సెట్‎తో బరిలోకి దిగుతామని చెప్పాడు. మా ప్లేయర్లు షాదాబ్, నవాజ్ మంచి ఫామ్‎లో ఉండటం తమకు కలిసి వస్తుందన్నాడు. గత ఆసియా కప్‎లో ఇండియా, పాక్ మ్యాచులు ఏకపక్షంగా సాగాయనే వాదనను అతడు తోసిపుచ్చాడు. మేం గెలుపు కోసం చివరి వరకు పోరాడమని డ్యామేజ్ కంట్రోల్ కామెంట్స్ చేశాడు.

కానీ ఈ సారి మాత్రం అద్భుతంగా ఆడుతామని కలలు కన్నాడు. తన ఫామ్ పట్ల ఆనందంగా ఉన్నానన్నాడు. సాహిబ్జాదా ఫర్హాన్ వ్యాఖ్యలకు ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. పాక్ గ్రౌండ్ లో గెలవదని.. కేవలం మాటల్లోనే గెలుస్తుందని సెటైర్లు వేస్తున్నారు.