కరప్షన్ కింగ్ KTR : హైదరాబాద్ సిటీ వీధుల్లో ఫ్లెక్సీలు

కరప్షన్ కింగ్ KTR : హైదరాబాద్ సిటీ వీధుల్లో ఫ్లెక్సీలు

హైదరాబాద్ సిటీ వీధుల్లో షాకింగ్ ఇన్సిడెంట్.. సోషల్ మీడియాలో హ్యాపీ బర్త్ డే కేటీఆర్ అంటూ అందరూ విషెస్ చెబుతున్నారు. అయితే  రోడ్డెక్కిన హైదరాబాదీ జనానికి కనిపించిన ఫ్లెక్సీలు షాక్ ఇచ్చాయి. హ్యాపీ బర్త్ డే కరప్షన్ కింగ్ KTR అంటూ సిటీలోని ప్రధాన రోడ్లపై.. ఫ్లెక్సీలు దర్శనం ఇచ్చాయి.

పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ చేసిన అవినీతి, అక్రమాలను ఫ్లెక్సీల రూపంలో ప్రదర్శించారు.,. ఈ ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేశారు అనేది ఎవరూ క్లెయిమ్ చేయలేదు.. బాప్ ఆఫ్ పేపర్ లీక్.. కేటీఆర్ హయాంలో జరిగిన పేపర్ లీక్ వల్ల 27 మంది స్టూడెంట్స్ చనిపోయారని మరో ఫ్లెక్సీలో రాశారు..

హైదరాబాద్ లోని  శేర్లింగంపల్లి, గచ్చిబౌలి,  హైటెక్ సిటీ,  నిజాం క్లబ్ దగ్గర ఈ పోస్టర్లు కలకం రేపుతున్నాయి. కేటీఆర్‌ను బాప్ ఆఫ్ పేపర్ లీక్ అంటూ కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయి సెటైర్లు వేశారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా ప్రత్యేక గిఫ్ట్ ఇస్తున్నామని చెప్తూ... ఈ ఫ్లెక్సీల ద్వారా పలు ఘాటైన ప్రశ్నలను సంధించారు. గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన వరుస ప్రశ్నపత్రాల లీకేజీల వ్యవహారాన్ని ఈ ఫ్లెక్సీలలో ప్రముఖంగా ప్రస్తావించారు.

మీ పాలనలో జరిగిన పేపర్ లీకులపై ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? అంటూ కేటీఆర్‌ను నేరుగా ప్రశ్నించారు. అంతేకాకుండా, గతంలో పరీక్షల అక్రమాలు ,లీకేజీల కారణంగా 27 మంది విద్యార్థుల బలవన్మరణాలకు బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని ఆరోపిస్తూ ఫ్లెక్సీలలో కడిగిపారేశారు.

ALSO READ : నీట్ పేపర్ లీక్..కేంద్రం, NTAలకు సుప్రీంకోర్టు నోటీసులు

 అలాగే మరోవైపు 21 మంది విద్యార్థుల చావులకు బీజేపీనే కారణమంటూ తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపించారు. పుట్టినరోజు నాడే కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ వేసిన ఈ పేపర్ లీక్ ఫ్లెక్సీలు ఇప్పుడు రాష్ట్ర రాజధాని రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.