హిందుస్థాన్ జింక్ లాభం డబుల్.. జూన్ క్వార్టర్లో రూ.5,469 కోట్లు

హిందుస్థాన్ జింక్ లాభం డబుల్.. జూన్ క్వార్టర్లో రూ.5,469 కోట్లు

హైదరాబాద్​, వెలుగు: వేదాంత గ్రూప్ సంస్థ  హిందుస్థాన్ జింక్ తాజా ఆర్థిక సంవత్సరం జూన్​ క్వార్టర్లో అద్భుతమైన ఆర్థిక ఫలితాలను సాధించింది. ఈసారి కంపెనీ నికర లాభం రెండు రెట్లు పెరిగి రూ.5,469 కోట్లకు చేరుకుంది.  గతేడాది ఇదే కాలంలో లాభం రూ.2,234 కోట్లుగా నమోదైంది. మెటల్ ధరలు పెరగడం, ఉత్పత్తి సామర్థ్యం మెరుగుపడటంతో కంపెనీ ఆదాయం 71.6 శాతం ఎగబాకి రూ.13,033 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో మాజీ సెయిల్ చైర్మన్ అమరేందు ప్రకాష్‌‌ను సంస్థ నూతన సీఈఓగా కంపెనీ బోర్డు నియమించింది.