‘సెమీకాన్ తెలంగాణ’ నిర్వహణకు ప్రపోజల్

‘సెమీకాన్ తెలంగాణ’ నిర్వహణకు ప్రపోజల్

హైదరాబాద్​, వెలుగు: భారత్‌‌‌‌లో సెమీకండక్టర్ పరిశ్రమ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో రెండు తెలుగు రాష్ట్రాలకు అపార అవకాశాలు ఉన్నాయని టీ–చిప్, వరల్డ్ తెలుగు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కౌన్సిల్ చైర్మన్ సందీప్ తెలిపారు.  ఢిల్లీలో జరుగుతున్న సెమీకాన్ ఇండియా సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రపంచ సెమీకండక్టర్ పరిశ్రమతో అనుసంధానం చేసేలా హైదరాబాద్‌‌‌‌లో ‘సెమీకాన్ తెలంగాణ’ సదస్సు నిర్వహణకు ప్రతిపాదించామని వెల్లడించారు.

సెమీ ఇండియా అధ్యక్షుడు అశోక్ చందక్‌‌‌‌ను సత్కరించి తెలుగు రాష్ట్రాల పర్యటనకు ఆహ్వానించారు. సెమీకాన్ 2.0 కింద కేంద్రం ఇప్పటికే 12 ప్రాజెక్టులకు రూ.1.64 లక్షల కోట్ల పెట్టుబడులను ఆమోదించిందని గుర్తుచేశారు. తెలంగాణకు చిప్ డిజైన్, ఏఐ చిప్స్ రంగాల్లో, ఏపీకి చిప్ తయారీ, ప్యాకేజింగ్ విభాగాల్లో అవకాశాలు ఉన్నాయన్నారు. రెండు రాష్ట్రాలు కలిస్తే సమగ్రమైన సెమీకండక్టర్ వ్యవస్థ ఏర్పడుతుందని సందీప్​ అభిప్రాయపడ్డారు.