మహిళలకు గుడ్ న్యూస్.. నొప్పులకు చెక్ పెట్టే క్యూరా పాడ్ ఎం

మహిళలకు గుడ్ న్యూస్.. నొప్పులకు చెక్ పెట్టే క్యూరా పాడ్ ఎం

హైదరాబాద్, వెలుగు: మహిళలు నెలసరి సమయంలో ఎదుర్కొనే నొప్పుల నుంచి ఉపశమనం కల్పించేందుకు హైదరాబాద్‌‌‌‌కు చెందిన హెల్త్ టెక్ సంస్థ లైట్‌‌‌‌మెడ్ ఇండియా క్యూరా పాడ్ ఎమ్ పరికరాన్ని అందుబాటులోకి తెచ్చింది.  ఇది మెడికల్ గ్రేడ్ ఫోటో బయోమాడ్యులేషన్, ఏఐతో పనిచేస్తుంది.  మందులు లేకుండా కాంతి తరంగాల ద్వారా నొప్పులను తగ్గిస్తుంది. క్లినికల్ పరీక్షల్లో 80 శాతం మంది మహిళలు దీంతో నొప్పి నుంచి పూర్తి ఉపశమనం పొందారని సంస్థ తెలిపింది. క్యూరాపాడ్​కు సీడీఎస్‌‌‌‌సీఓ అనుమతితో పాటు అమెరికా ఎఫ్‌‌‌‌డీఏ గుర్తింపు లభించింది.  ధర రూ.12 వేలు.