- ఈ ఏడాది జులైలో 9 వేల మందిని తీసేసిన కంపెనీ
న్యూఢిల్లీ: జర్మన్ ఆటోమొబైల్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ సబ్సిడరీ పోర్షే మరో 4,100 ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. 9 వేల ఉద్యోగులను తీసేస్తామని ఈ ఏడాది జులైలో ప్రకటించగా, దీనికి లేబర్ యూనియన్స్ కూడా ఆమోదం తెలిపాయి. తాజాగా తొలగించనున్న 4,100 మంది, ఈ 9 వేల మందికి అదనం. 2035 నాటికి ప్రతి ఐదుగురిలో ఒకరిని తొలగించాలని కంపెనీ ప్లాన్ చేసింది . పోర్షే నష్టాలు పెరగడంతో ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ తన పూర్తి ఏడాది ప్రాఫిట్ మార్జిన్ అంచనాను 4.0–5.5శాతం నుంచి ఏకంగా 1 శాతానికి తగ్గించింది. చైనాలో కంపెనీ కార్ల అమ్మకాలు భారీగా పడిపోవడం, ఈవీ స్ట్రాటజీ బెడిసికొట్టడంతో పోర్షే సీఈఓ మైఖేల్ లీటర్స్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. కాగా, 2030 నాటికి దశలవారీగా లక్ష ఉద్యోగాలను తగ్గించాలని ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ నిర్ణయించింది
