హీరో విశ్వక్‌సేన్ దర్శకుడిగా రూపొందిస్తున్న చిత్రం ‘కల్ట్’. తారక్ సినిమాస్ బ్యానర్‌పై సందీప్ కాకరాల నిర్మిస్తున్నారు. భారతదేశపు తొలి ఆథెంటిక్ స్లాషర్ థ్రిల్లర్ ఇది. తరుణ్ భాస్కర్ డైలాగ్స్ రాస్తున్నాడు. అక్టోబర్ 30న ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన గ్లింప్స్‌లో సినిమా కథా నేపథ్యంపై ఆసక్తిని పెంచింది. విశ్వక్‌సేన్ ఇంటెన్స్ కిల్లింగ్ స్ప్రీ, కోపంతో కూడిన యాటిట్యూడ్ ఈ వీడియోను మరింత షాకింగ్‌గా మార్చాయి. ముఖ్యంగా విశ్వక్ తొలిసారి నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.
నిజ జీవితంలో జరిగిన కొన్ని కలవరపరిచే సంఘటనల నుంచి స్ఫూర్తి పొంది ఈ సినిమాను రూపొందిస్తున్నట్టు విశ్వక్‌సేన్ చెప్పాడు. డార్క్, ఇంటెన్స్, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోందని అన్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిందని సినిమా కూడా కొత్త అనుభూతిని పంచుతుందని తెలియజేశాడు. ఈ చిత్రంలో గాయత్రి భరద్వాజ్, తారక్ పొన్నప్ప, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, కార్తికేయ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు.
