బీ అలర్ట్..డ్రైనేజీలను వెంటనే క్లియర్ చేయాలి  : సీఎస్ సంజయ్ జాజు

బీ అలర్ట్..డ్రైనేజీలను వెంటనే క్లియర్ చేయాలి  : సీఎస్ సంజయ్ జాజు
  • అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో సీఎస్​ సంజయ్ జాజు అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని 3 మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు, పోలీస్ కమిషనరేట్ల ఉన్నతాధికారులతో చేపట్టిన ముందస్తు చర్యలపై  సమీక్ష నిర్వహించారు.  వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అధికారులు, సిబ్బంది అప్రమత్తతతో ఉండాలని ఆదేశించారు. నీరు నిలిచే ప్రాంతాల్లో డ్రైనేజీలను వెంటనే క్లియర్ చేయాలని సూచించారు.

ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అంతరాయం కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని, అత్యవసర పరిస్థితులు తలెత్తిన వెంటనే వేగంగా స్పందించేలా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ సమాచారం ప్రకారం, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, మేడ్చల్–మల్కాజిగిరి, నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్, నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

గణేశ నిమజ్జన శోభాయాత్ర ఏర్పాట్లపై సమీక్ష

గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సీఎస్ పరిశీలించారు. బాలాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు హైదరాబాద్ నగరంలోని ప్రధాన శోభాయాత్ర మార్గాల్లో రహదారుల పరిస్థితి, రోడ్ల రిపేర్లు, పారిశుద్ధ్య నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, నీరు నిలిచే ప్రాంతాల్లో చేపట్టిన చర్యలను పరిశీలించారు. టీ-జీఐసీసీసీ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి అధికారి కమల్ హాసన్ రెడ్డి సీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా శోభాయాత్ర మార్గాల్లో చేపట్టిన నిఘా ఏర్పాట్లను వివరించారు.