వివిధ జిల్లాలకు డీసీసీ అధ్యక్షుల నియామకం

వివిధ జిల్లాలకు డీసీసీ అధ్యక్షుల నియామకం

హైదరాబాద్, వెలుగు: వివిధ జిల్లాలకు కొత్త జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులను నియమిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా చేపట్టిన ఈ నియామకాల్లో భాగంగా, రామగుండం కార్పొరేషన్ అధ్యక్షుడిగా ఎండీ ముస్తఫాను, రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలిగా చిగిరింత పారిజాతను, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా పటోళ్ల చంద్రశేఖర్ రెడ్డిని అధిష్టానం ఎంపిక చేసింది. పార్టీ బలోపేతానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.