బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ నుంచి అజిత్ అగార్కర్ ను తీసేయడానికి రీజన్స్ ఇవే

బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ నుంచి అజిత్ అగార్కర్ ను తీసేయడానికి రీజన్స్ ఇవే

న్యూఢిల్లీ: బీసీసీఐ చీఫ్‌‌ సెలెక్టర్‌‌ పదవి నుంచి అజిత్‌‌ అగార్కర్‌‌ను తొలగించారు. హిట్‌‌మ్యాన్‌‌ రోహిత్‌‌ శర్మ భవిష్యత్‌‌పై నెలకొన్న అనిశ్చితి, సెంటర్‌‌ ఆఫ్‌‌ ఎక్సలెన్స్‌‌ (సీవోఈ) హెడ్‌‌ వీవీఎస్‌‌ లక్ష్మణ్‌‌తో విభేదాల వల్లే అగార్కర్‌‌ను పదవినుంచి తప్పించినట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌‌ సిరీస్‌‌ వైఫల్యంపై ముంబైలో జరిగిన అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశానికి అగార్కర్‌‌ గైర్హాజర్‌‌ కావడం అప్పట్లో బోర్డులో తీవ్ర చర్చనీయాంశమైంది.

అప్పుడే అగార్కర్‌‌ను తొలగించాలని బోర్డు పెద్దలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. 2027 వన్డే వరల్డ్‌‌ కప్‌‌కు యువ ఆటగాళ్లను సిద్ధం చేయాలని అగార్కర్‌‌ భావించగా, బోర్డు పెద్దలు సీనియర్లను కొనసాగించాలని భావించారు. ఈ అంశంలో బోర్డు పెద్దలతో భేదాభిప్రాయాలు తలెత్తాయి. అదే టైమ్‌‌లో రోహిత్‌‌ భవిష్యత్‌‌పై సెలెక్షన్‌‌ కమిటీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా బీసీసీఐ ప్రత్యేక ప్రకటనను విడుదల చేయడం కూడా అగార్కర్‌‌ను తీవ్ర మనస్తాపానికి గురి చేసింది. ప్లేయర్ల గాయాలు, షెడ్యూల్‌‌, ఇండియా–ఎ మ్యాచ్‌‌ల నిర్వహణ విషయంలో లక్ష్మణ్‌‌తో తీవ్ర అభిప్రాయభేదాలు రావడం కూడా తప్పించడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.